Movie Stars Vote: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని 17 స్థానాలకు పోలింగ్‌ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకుంది. వర్షం కురిసే అవకాశం ఉండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోసం పోలింగ్‌ సామగ్రి అందించింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లంతా తమ స్వస్థలాలకు వెళ్లారు. ఇక హైదరాబాద్‌లో నివసించే ప్రముఖులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు. వీఐపీలు వచ్చే పోలింగ్‌ కేంద్రాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KCR Bus Yatra: నా వయసైపోతుంది.. యువకుల్లారా ఇక తెలంగాణ మీదే: కేసీఆర్‌


హైదరాబాద్‌ ఓటర్లు ఈసారి వేస్తారా?
ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన ఓటు హక్కు వినియోగించుకోవడంలో హైదరాబాద్‌ ఓటర్లు ఆసక్తి కనబర్చడం లేదు. ఐదు నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు అత్యల్పంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంచడానికి ఎన్నికల సంఘం ప్రయత్నాలు చేస్తోంది. హైదరాబాద్‌ ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలను రప్పించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. మరి ఈసారి హైదరాబాద్‌ ఓటర్లు ఏ మేర ఓటు వేసేందుకు ఆసక్తి కనబరుస్తారో చూడాలి. ముందే వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో ఓటింగ్‌ శాతం మరింత తగ్గుతుందా? లేదా పెరుగుతుందా అనేది వేచి చూడాలి.

Also Read: Chiranjeevi: పవన్‌కల్యాణ్‌ పోటీపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు.. నేను పిఠాపురం వెళ్లడం లేదు


పోలింగ్‌ సందర్భంగా సినీ, రాజకీయ, ఇతర ప్రముఖులు ఎక్కడెక్కడ ఓటు వేస్తారో వివరాలు ఇలా ఉన్నాయి.


  • హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి పాఠశాలలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తన భార్య ప్రణతితో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

  • నంద్యాలలో పర్యటించి ఏపీ రాజకీయాల్లో కాక రేపిన అల్లు అర్జున్ మాత్రం తన ఓటును హైదరాబాద్‌లో వినియోగించుకోనున్నాడు. అతడితోపాటు ఆయన భార్య స్నేహారెడ్డి, తండ్రి, నిర్మాత, అల్లు అరవింద్, తమ్ముడు అల్లు శిరీష్‌ కూడా ఇక్కడే ఓటు వేయనున్నారు.

  • జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో చాలా మంది సినీ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, నమ్రత, విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ, మంచు మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్‌, శ్రీకాంత్‌, జీవిత రాజశేఖర్ తదితరులు ఓటు వేయనున్నారు.

  • ఫిలింనగర్‌లోని ఎఫ్‌ఎన్‌సీస్‌లో యువ హీరోలు విశ్వక్‌సేన్‌ , దగ్గుబాటి రానా, దర్శకుడు రాఘవేంద్రరావు, జీవిత, రాజశేఖర్‌, సురేశ్‌ బాబు తదితరులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

  • జూబ్లీహిల్స్‌ క్లబ్‌లో మెగా కుటుంబం ఓటు హక్కు వినియోగించుకోనుంది. ఇక్కడ మెగాస్టార్‌ చిరంజీవి, సురేఖ, రామ్‌చరణ్, ఉపాసనతోపాటు హీరో నితిన్‌ ఓటు వేయనున్నారు.

  • జూబ్లీహిల్స్ న్యూ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో రవితేజ, వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌లో అక్కినేని కుటుంబం ఓటు వేయనుంది. నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్‌ తదితరులు ఓటు వేయనున్నారు.

  • మణికొండలోని ప్రభుత్వ పాఠశాలలో సినీ నటులు వెంకటేశ్, బ్రహ్మానందం

  • షేక్‌పేట్  ఇంటర్నేషనల్ స్కూల్‌లో దర్శకుడు రాజమౌళి, రమా రాజమౌళి

  • బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో హీరో రామ్ పోతినేని 

  • గచ్చిబౌలిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో హీరో నాని 

  • దర్గా గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ లో హీరో సుధీర్ బాబు 

  • రోడ్‌ నెం.45, జూబ్లీహిల్స్‌ ఆర్థిక సహకార సంస్థలో అల్లరి నరేశ్‌

  • యూసఫ్‌గూడ చెక్‌పోస్టులోని ప్రభుత్వ పాఠశాలలో దర్శకుడు, నటుడు తనికెళ్ల భరణి ఓటు వేయనున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter